సరిహద్దు సహకార ప్రణాళికపై సౌదీ-ఖతార్ సంతకాలు
- December 26, 2023
రియాద్: సల్వా (సౌదీ) - అబూ సమ్రా (ఖతారీ) సరిహద్దులో సరిహద్దు విధానాలను సులభతరం చేసే కార్యాచరణ ప్రణాళికపై సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ మరియు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ సంతకం చేశారు. రియాద్‌లో సోమవారం జరిగిన అధికారిక సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది.అంతకుముందు ఖతార్ అంతర్గత మంత్రి మరియు అతని ప్రతినిధి బృందానికి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ ఘన స్వాగతం పలికారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతో ఈ సమావేశం జరిగిందని, ఇది రెండు దేశాల మధ్య చారిత్రక సోదర సంబంధాలను ప్రతిబింబిస్తుందని ప్రిన్స్ అబ్దుల్ అన్నారు. ముఖ్యంగా భద్రతా రంగంలో ఉమ్మడి చర్యను పెంపొందించడానికి ఇరు దేశాల నాయకత్వాల నిబద్ధతను ఇది తెలియజేస్తోందన్నారు. సెషన్లో భాగంగా రెండు పార్టీలు తమ అంతర్గత మంత్రిత్వ శాఖల మధ్య ఇప్పటికే ఉన్న భద్రతా సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు.
తాజా వార్తలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..







