ఇరాక్ ఎడారిలో ఇద్దరు కువైటీల కిడ్నాప్
- December 26, 2023
కువైట్: ఇరాక్‌లోని ఎడారి ప్రాంతంలో వేటకు వెళ్లి కిడ్నాప్‌కు గురైన ఇద్దరు కువైటీల కోసం భద్రతా దళాలు వెతుకుతున్నాయని అధికారులు సోమవారం తెలిపారు. అన్బర్ మరియు సలావుద్దీన్ ప్రావిన్సుల మధ్య ఎడారి ప్రాంతంలో ఆదివారం కిడ్నాప్ జరిగినట్లు పోలీసు కల్నల్ వెల్లడించారు. అయితే, ఇరాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక కువైట్ జాతీయుడి కిడ్నాప్ మాత్రమే జరిగిందని ప్రకటించింది. ఇదే విషయంపై కువైట్ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబాహ్‌తో ఇరాక్ విదేశాంగ మంత్రి ఫువాద్ హుస్సేన్ మాట్లాడారు. కువైటీలు ప్రయాణిస్తున్న వాహనంనూ కొందరు ముష్కరులు దాడి చేశారని, అనంతరం ఇద్దరు కువైట్‌లతో సంబంధాలు తెగిపోయాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







