హైదరాబాద్‌లో అయోధ్య రామమందిరం తలుపులు తయారీ
- December 26, 2023
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. కొత్త సంవత్సరం జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది.మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార యాంత్రంగం దీనిపై రోజూ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది.
అయోధ్య సూర్యస్తంభాన్ని నిర్మించారు. అయోధ్యలోని ధర్మపథ్ మార్గంలో దీన్ని నెలకొల్పారు. దీని ఎత్తు సుమారు 20 అడుగులు. పైభాగంలో సూర్యుడి ప్రతిబింబాన్ని అమర్చారు. స్తంభంపై జై శ్రీరామ్ అనే అక్షరాలను హిందీలో ముద్రించారు. హనుమంతుడు, గద, ఇతర రామాయణ ఘట్టాలను దీనిపై చిత్రీకరించారు.
కాగా- రామాలయం గర్భగుడి ఫొటోలు ఇటీవలే విడుదల అయ్యాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. వాటిని విడుదల చేసింది. గర్భాలయ ఫొటోలు వెలుగులోకి రావడం అదే తొలిసారి. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం సరిగ్గా 12:45 నిమిషాలకు గర్భాలయ పీఠంపై రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తామని పేర్కొంది.
చారిత్రాత్మక రామమందిరం ఆలయానికి అవసరమైన తలుపులు, ద్వార బంధనాలు హైదరాబాద్‌లో తయారు కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సికింద్రాబాద్ న్యూబోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ ఇంటర్నేషనల్స్ సంస్థ వాటిని తయారు చేస్తోంది. మొత్తంగా 100 తలుపులు తయారువుతున్నాయి.
వాటి తయారీ తుదిదశకు చేరుకుందని, త్వరలోనే అయోధ్యకు తరలిస్తామని అనురాధ టింబర్ ఇంటర్నేషనల్స్ యజమాని శరత్ బాబు తెలిపారు. తలుపుల తయారీ కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమను సంప్రదించిందని, దీన్ని తమ పూర్వజన్మఫలంగా భావిస్తోన్నామని అన్నారు.
తలుపుల తయారీ కోసం మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి తెప్పించిన నాణ్యమైన టేకును వినియోగిస్తోన్నామని శరత్ బాబు చెప్పారు. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాలను తలపులపై చిత్రీకరిస్తోన్నామని, రామాలయ ప్రారంభోత్సవం దగ్గర పడుతుండటంలో మూడు షిఫ్టుల్లో వాటిని రూపొందిస్తోన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!