దుబాయ్ లో న్యూఇయర్ వేడుకలు: షేక్ జాయెద్ రోడ్ మూసివేత టైమింగ్స్
- December 28, 2023
దుబాయ్: డిసెంబరు 31 సాయంత్రం 4 గంటల నుంచి కొత్త సంవత్సర వేడుకల కోసం రోడ్లను మూసివేయడం ప్రారంభించనున్నట్లు దుబాయ్ పోలీసులు బుధవారం తెలిపారు. డౌన్‌టౌన్ ప్రాంతం, ఇతర ప్రసిద్ధ ప్రదేశాలకు వచ్చే సందర్శకులు మరియు నివాసితులు తమ ప్రయాణాలను ముందుగానే షెడ్యూల్ చేసుకోవాలని, ప్రజా రవాణాను ఉపయోగించాలని దుబాయ్ పోలీస్‌లోని ట్రాఫిక్ విభాగానికి చెందిన అబ్దుల్ రెహ్మాన్ ఒబైద్ జుమా అల్ ఫలాసి సూచించారు. మహ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్ సాయంత్రం 4 గంటలకు మూసివేయడం ప్రారంభమవుతుంది. ఫైనాన్షియల్ రోడ్ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మూసివేయబడుతుంది. అల్ అసయెల్ రోడ్ కూడా సాయంత్రం 4 గంటలకు మూసివేయబడుతుంది. ఈ రోడ్ల నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా షేక్ జాయెద్ రోడ్డుకు మళ్లించబడుతుందని తెలిపారు. షేక్ జాయెద్ రోడ్, దుబాయ్ యొక్క ఆర్టీరియల్ హైవే, అన్ని రకాల ట్రాఫిక్లకు రాత్రి 9 గంటలకు మూసివేయబడుతుంది. మరోవైపు ఎమిరేట్ అంతటా నూతన సంవత్సర వేడుకల కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా హట్టా, బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్, ఫెస్టివల్ సిటీలో జరిగే వేడుకలు ప్రధానంగా నిల్వనున్నాయి. నూతన సంవత్సర పండుగ సందర్భంగా పౌర రక్షణ, RTA మరియు అంబులెన్స్‌లకు మద్దతుగా ఎమిరేట్‌లో 10,000 కంటే ఎక్కువ మంది పోలీసు అధికారులు, వాలంటీర్లను, దాదాపు 1,300 వాహనాలను మోహరిస్తామని అల్ ఫలాసి చెప్పారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!