తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి
- December 31, 2023
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది ఏ.సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత వారమే ప్రభుత్వం ఈయన పేరును సూచిస్తూ ఆమోదం కోరకు గవర్నర్ కార్యాలయానికి పంపింది. అయితే గవర్నర్ బిజీగా ఉండటం వల్ల ఆమోదానికి కాస్త సమయం పట్టింది. గవర్నర్ ఆమోదం తరువాత ప్రభుత్వం ఏజీ నియమకానికి సంబంధించి జీవో 636ను విడుదల చేసింది.
పదేండ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏజీ పదవి కోసం చాలా మంది సీనియర్ న్యాయవాదుల పేర్లు వినిపించాయి. అయనప్పటికి, ప్రభుత్వం గతంలో ఏజీగా పని చేసిన సుదర్శన్ రెడ్డి వైపే మగ్గు చూపింది. 2011లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉమ్మడి హైకోర్టులో సుదర్శన్ రెడ్డి ఏజీగా విధులు నిర్వహించారు. అడ్వకేట్ జనరల్ పదవీ చేపట్టిన తొలి తెలంగాణ న్యాయవాది సుదర్శన్ రెడ్డి కావడం విశేషం. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వ పదవీ కాలం ముగిసే నాటికి ఏజీగా ఉన్న సుదర్శన్ రెడ్డి మళ్లీ ఏజీ కావడం గమనార్హం.
తాజా వార్తలు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!