హెబ్బా పటేల్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’.!

- January 06, 2024 , by Maagulf
హెబ్బా పటేల్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’.!

‘కుమారి 21 ఎఫ్’ అంటూ క్రేజీ మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైంది అందాల భామ హెబ్బా పటేల్. ఆ తర్వాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తదితర చెప్పుకోదగ్గ సినిమాల్లోనే నటించింది. కానీ, హీరోయిన్‌గా ఆశించిన స్థాయికి ఎదగలేకపోయింది.

ఈ మధ్య ఓటీటీల్లో సందడి చేస్తోంది. మొన్నా మధ్య ‘ఓదెల రైల్వేస్టేషన్’ అనే ఓటీటీ సినిమాలో తనదైన పర్‌ఫామెన్స్ ఇచ్చి శభాష్ అనిపించుకుంది హెబ్బా పటేల్.

మరిన్ని ఓటీటీ సిరీస్‌లతో బిజీగా గడుపుతోంది. తాజాగా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ రోజు హెబ్బా పటేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

శారీలో నవ్వులు చిందిస్తూ.. చాలా ప్లెజెంట్‌గా కనిపిస్తోంది ఈ లుక్‌లో హెబ్బా పటేల్. సినిమాలు కాస్త తగ్గినా.. ఓటీటీలో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ హెబ్బా పటేల్ కెరీర్‌లో బిజీగానే గడుపుతోంది.

ఈ నేపథ్యంలోనే ఈ పుట్టినరోజు ఆమెకు మరెన్నో విజయవంతమైన చిత్రాలను అందించాలనీ, కెరీర్‌లో మరిన్ని మైలురాయిలు అందుకోవాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్ డే టు యు హెబ్బా పటేల్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com