ఇస్రో మ‌రో ఘ‌న‌త‌.. ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్..

- January 06, 2024 , by Maagulf
ఇస్రో మ‌రో ఘ‌న‌త‌.. ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్..

బెంగుళూరు: సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఆదిత్య ఎల్‌-1 త‌న గ‌మ్య‌స్థానాన్ని చేరుకుంది. 125 రోజుల పాటు అంత‌రిక్షంలో ప్ర‌యాణించిన ఆదిత్య ఎల్‌-1 సూర్యుడి నుంచి 15 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల దూరంలోని ల‌గ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో క‌క్ష్య‌లోకి చేరుకుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు మరోసారి థ్రస్టర్లను మండించి హాలో క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టారు. ఈ శాటిలైట్ ఇక్క‌డి నుంచే సూర్యుడిని నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తుంది.

కాగా.. ఈ ప్ర‌యోగం విజ‌యం కావ‌డం పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. శాస్త్ర‌వేత్త‌ల‌ను అభినందించారు. ‘భారత్ మరో మైలురాయిని చేరుకుంది. దేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 దాని గ‌మ్య‌స్థానాన్ని చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ అసాధార‌ణ విజ‌యం సాధించిన శాస్త్ర‌వేత్త‌ల‌కు అభినంద‌న‌లు. మానవాళి ప్రయోజనం కోసం, శాస్త్ర‌సాంకేతిక రంగంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరుకునే ప్ర‌యాణం కొన‌సాగుతోంది.’ అని ప్ర‌ధాని మోదీ ఎక్స్ వేదిక‌గా తెలియ‌జేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com