చలికాలంలో వచ్చే దంత సమస్యలకు ఇంటి చిట్కాలు.!

- January 06, 2024 , by Maagulf
చలికాలంలో వచ్చే దంత సమస్యలకు ఇంటి చిట్కాలు.!

చలికాలంలో సహజంగా వచ్చే దగ్గు, జలుబు వంటి ఫ్లూ సమస్యలతో పాటూ,  దంత సమస్యలు కూడా ఎక్కువగా వేధిస్తుంటాయ్. అందుకు కారణం చలికాలంలో పళ్లు సెన్సిటివ్‌గా మారిపోవడమే.

దంత సమస్యలతో పాటూ, చిగురు వాపు. చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయ్. అందుకు మార్కెట్లో బోలెడన్ని సెన్సిటివ్ టూత్ పేస్టులు అందుబాటులో వున్నాయనుకోండి.

అయితే, పళ్లు నొప్పిగా వున్నాయ్ కదా అని.. టూత్ పేస్ట్‌తో మరింత ఎక్కువగా పళ్లు తోమేసుకోవడం వల్ల ఈ సమస్యలు తీరిపోవు. సరికదా.. అలా ఎక్కువగా పళ్లు తోమడం వల్ల పళ్లపై వున్న ఎనామిల్ తొలగిపోయింది మరింత బాధ పెరుగుతుంది.

అందుకే వైద్యులు సూచించే మందులతో పాటూ, వంటింటి చిట్కాలు కూడా వాడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటితో తాత్కాలిక ఉపశమనం పొందడంతో పాటూ, కొన్నిసార్లు ఇవే ఆయా దంత సమస్యలకు చెక్ పెట్టే మార్గాలవుతాయ్.
గోరువెచ్చని నీటిలో సాల్ట్ వాటర్ వేసి పుక్కిలిస్తే దంత సమస్యలు చాలా వరకూ తగ్గిపోతాయ్.

అలాగే లవంగం సహజసిద్ధమైన ఎనస్తీషియాలా పని చేస్తుంది. భరించలేనంత పంటి నొప్పి వచ్చినప్పుడు లవంగాన్ని నీటిలో మరిగించి ఆ నీటిని పుక్కిలించడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. లేదంటే, డైరెక్ట్‌గా నొప్పి వున్నచోటే లవంగాన్ని వుంచి మెల్లగా చప్పరించినా ఫలితం వుంటుంది.

అలాగే, వెల్లుల్లిలో వుండే ఆలిసిన్ అనే ఔషధం పంటి నొప్పికి చాలా మంచి పరిష్కారాన్ని అందిస్తుంది. వెల్లుల్లిని డైరెక్ట్‌గా తిన్నా ఫర్వాలేదు. లేదంటే వాటర్‌లో మరిగించి తీసుకున్నా ఓకే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com