అటల్ సేతు బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

- January 12, 2024 , by Maagulf
అటల్ సేతు బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ముంబై: ముంబైలో సముద్రంపై నిర్మించిన దేశంలోని అతిపెద్ద బ్రిడ్జ్‌ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్‌ను అటల్ సేతు(Atal Setu)గా పిలువనున్నారు.

ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని కూడా దీన్ని పిలుస్తున్నారు. ఈ బ్రిడ్జ్ సుమారు 21.8 కిలోమీటర్ల పొడుగు ఉంది. బ్రిడ్జ్ పూర్తి పేరు అటల్ బిహారీ వాజ్‌పేయి సేవారి-నహవా సేవా అటల్ సేతు. సుమారు 17,840 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైని ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంది. దాదాపు రెండున్నర గంటల జర్నీని కేవలం 20 నిమిషాలకు కుదిస్తోంది.

భారత్‌లోనే అతిపొడువైన బ్రిడ్జ్‌గా దీన్ని గుర్తిస్తున్నారు. ఇక దేశంలో సముద్రంపై నిర్మించిన అతిపెద్ద బ్రిడ్జ్ కూడా ఇదే కానున్నది. డిసెంబర్ 2016లో ప్రధాని మోదీనే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుశస్థాపన చేశారు. ముంబై పోర్టు నుంచి జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు మధ్య దూరాన్ని కూడా తగ్గిస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com