డకార్ ర్యాలీలో ప్రమాదం. గాయపడ్డ సౌదీ ర్యాలీ డ్రైవర్
- January 14, 2024
జెడ్డా: సౌదీ అరేబియాలో ఐదవ సారి నిర్వహించిన డకార్ ర్యాలీ- 2024 ఆరవ దశ ముగిసే సమయంలో సౌదీ ర్యాలీ డ్రైవర్ మహా అల్ హమాలి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అల్ హమాలీ గాయపడటంతోపాటు పోటీ నుండి వైదొలగాల్సి వచ్చింది. ఆమె మెడ చుట్టూ మెడికల్ బ్రేస్తో హాస్పిటల్ బెడ్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆమె పేర్కొంది. అంతకుముందు ప్రమాద స్థలం నుండి ఆమెను హెలికాప్టర్ లో ఆస్పత్రికి తరలించారు. సౌదీ ఆటోమొబైల్ మరియు మోటార్ సైకిల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ప్రిన్స్ ఖలీద్ బిన్ సుల్తాన్ అల్ అబ్దుల్లా అల్ ఫైసల్ ఆమెను పరామర్శించారు. మరోవైపు ఆరవ దశ రేసు ముగిసే సమయానికి కేవలం 100 మీటర్ల దూరంలో వాహనం బోల్తా పడిన ప్రమాదం జరిగిందని అల్ హమాలీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివరించింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!