చరిత్ర సృష్టించిన 3 ఏళ్ల ఎమిరాటీ బాలిక
- January 16, 2024
యూఏఈ: అల్మహా రషేద్ అల్మీరీ (AlMaha Rashed AlMheiri) అనే మూడేళ్ల ఎమిరాటీ బాలిక 'ది ఫ్లవర్', 'హనీబీ' అనే రెండు పిల్లల కథలను ప్రచురించి చరిత్ర సృష్టించింది. 24 గంటల్లో 1,000 కాపీలు అమ్ముడుపోయాయి. దీంతో ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలైన రచయిత్రిగా చిన్నారి నిలిచిందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. జనవరి 7న జరిగిన అధికారిక వేడుక సందర్భంగా నర్సరీ విద్యార్థి రికార్డును బద్దలు కొట్టింది. అల్మహా కథ చెప్పడం, బొమ్మలు గీయడం పట్ల ఉన్న అభిరుచి ఆమెను ఈ రికార్డు సాధించేలా ప్రేరేపించిందని బాలిక తల్లి తెలిపారు. తన రెండు కథలలో పర్యావరణ సూత్రాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రయత్నించిందని తెలిపింది. తాము గత నవంబర్లో దుబాయ్లో COP28ని సందర్శించామని, అప్పుడే అల్మహాలో పర్యావరణ నేపథ్య కథల గురించి ఆలోచనలు వచ్చాయన్నారు. సాధారణంగా చాలా మంది పిల్లలు 6-7 సంవత్సరాల మధ్య చదవడం, వ్రాయడం నేర్చుకుంటారని కిడ్స్ హెల్త్ పరిశోధనలో వెల్లడించింది. కానీ 3 ఏళ్ల వయసులోనే అల్మహా చదవడం, వ్రాయడం నేర్చుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. అల్మహా అక్క అల్దాబీ, 7 సంవత్సరాల 360 రోజుల వయస్సులో ద్విభాషా పుస్తకాన్ని ప్రచురించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డును కలిగి ఉంది. అలాగే ఆమె సోదరుడు కూడా 4 సంవత్సరాల వయస్సులో పుస్తకాన్ని ప్రచురించిన అతి పిన్న వయస్కుడిగా (బాలుడు) రికార్డును కలిగి ఉన్నాడు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!