స్కూల్ ఫీల్డ్ ట్రిప్ కోసం Dh2,000. పేరెంట్స్ లో భిన్న అభిప్రాయాలు

- January 16, 2024 , by Maagulf
స్కూల్ ఫీల్డ్ ట్రిప్ కోసం Dh2,000. పేరెంట్స్ లో భిన్న అభిప్రాయాలు

యూఏఈ: దుబాయ్‌లోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీల్డ్ ట్రిప్ ఖర్చులు పెరగడంపై విద్యార్థుల తల్లిదండ్రులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ట్రిప్ లు ఖరీదైనవని కొందరు అంటుండగా.. కొంతమంది తల్లిదండ్రులు మాత్రం ముఖ్యమైన విద్యా ప్రయోజనాల కోసం ఇలాంటివి తప్పనిసరి అంటున్నారు. సన్‌మార్కే స్కూల్ లో చదివే పిల్లల తల్లి కజఖ్ జాతీయురాలు కరీనా షష్కోవా మాట్లాడుతూ.. “నేను వ్యక్తిగతంగా ఇది మంచి ఆలోచన అని అనుకుంటున్నాను. పిల్లలను పర్యటనకు తీసుకెళ్లడానికి నా సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. వారికి సామాజిక-సాంస్కృతిక ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఇతర సహవిద్యార్థులు సరదాగా గడుపుతారు. వారి మానసిక సామర్థ్యాలు మెరుగుపడతాయని నేను భావిస్తున్నాను. ఇవన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇందుకోసం వెచ్చించే అమౌంట్ తక్కువే అనిపిస్తుంది." అని అన్నారు. “5వ క్లాస్ చదువుతున్న తన కొడుకు ఫీల్డ్ ట్రిప్ కోసం రస్ అల్ ఖైమాకు వెళుతున్నాడు.  అక్కడ వారు హైకింగ్, క్యాంపింగ్, స్విమ్మింగ్ మరియు ఇతర కార్యకలాపాలలో పాల్గొంటారు. దీనికి పాఠశాల 2,000 దిర్హామ్‌లు వసూలు చేస్తోంది. ఇలాంటివి మనం చేయాలంటే అంతకంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి ఉంటుంది.”అని మరో తల్లి అభిప్రాయపడ్డారు. “నా కొడుకు 3వ సంవత్సరం చదువుతున్నాడు. అతని స్కూల్ ఫీజు ఇప్పటికే 60,000 దిర్హామ్‌లకు పైగా ఉంది. ట్యూషన్ ఫీజు ఏమైనప్పటికీ సంవత్సరానికి పెరుగుతూనే ఉంటుంది. అంతే కాకుండా బస్సు ఛార్జీలు, యూనిఫాంలకు సంబంధించిన ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు నేను అలాంటి ఫీల్డ్ ట్రిప్‌లను ప్రోత్సహించను. ముఖ్యంగా పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి ఇప్పటికే సందర్శించిన ప్రదేశాలకు అనవసరమని నేను భావిస్తాను. అదే విధంగా గతంలో నిర్వహించిన ఫీల్డ్ ట్రిప్పులతో పెద్దగా ప్రయోజనం రాలేదు. అందుకే ఇప్పుడు తన కొడును పంపకూడదని నిర్ణయించుకున్నాను." అని భారతీయ ప్రవాసుడు అరిజిత్ నంది తెలిపారు.

కాగా, ప్రతి పర్యటనకు నిర్దిష్ట అనుమతి దుబాయ్ పాఠశాలలకు అవసరం లేదని నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) నిర్దేశిస్తుంది. అయితే, ఈ ఫీల్డ్ ట్రిప్‌లు తప్పనిసరిగా పాఠ్యప్రణాళికలో భాగంగా ఉండాలి. విద్యార్ధులను తీసుకెళ్లే ముందు పాఠశాలలు రిస్క్ అసెస్‌మెంట్ ప్రయోజనాల కోసం తప్పనిసరిగా సైట్‌ను రిసీవ్ చేయాలని కూడా ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ ఆదేశించింది. విద్యాసంస్థలు అన్ని విద్యార్థుల పర్యటనలు, ఈవెంట్‌లు ప్రయోజనకరంగా, సురక్షితంగా మరియు విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com