మెగా-వశిష్ట ప్రాజెక్ట్.‌కి ఆల్ సెట్.!

- January 16, 2024 , by Maagulf
మెగా-వశిష్ట ప్రాజెక్ట్.‌కి ఆల్ సెట్.!

లో బడ్జెట్.. కోవిడ్ పరిస్థితుల్ని తట్టుకుని తెరకెక్కించిన సినిమా ‘బింబిసార’. వున్న రీసోర్సెస్‌లోనే క్వాలిటీ మూవీని తెరకెక్కించి హిట్టు కొట్టేశాడు కొత్త దర్శకుడు వశిష్ట. అలా ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు తొలి సినిమాతోనే వశిష్ట.
ఇండస్ట్రీ దృష్టిలో పడడమే కాదు, ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా ఒప్పించేంత స్థాయికి వెళ్లిపోయాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది.
సంక్రాంతి సందర్భంగా సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఇంతవరకూ ప్రచారంలో వున్నట్లుగానే ‘విశ్వంభర’ టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.
టైటిల్ ప్రకటిస్తూ.. ఓ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. విశ్వం నుంచి కిందికి పడుతున్న ఓ రహస్య పేటిక.. వచ్చే దారిలో అంతరిక్షంలోని ఆస్టరాయిడ్స్‌ని ఢీకొని కొన్ని శకలాలుగా చీలడం.. అయితే, ఆ పెట్టెలో ఏముంది.?
‘విశ్వంభరుడి’ రహస్యం ఏంటీ.? ఓ ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో సినిమాని తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ వశిష్ట.
కాన్సెప్ట్ వీడియో చూస్తే.. గతంలో చిరంజీవి నటించిన ‘అంజి’ సినిమా గుర్తుకొస్తుంది. అయితే, మూడు కాలాల నేపథ్యంలో సినిమా వుండబోతోందని అంటున్నారు. ఏది ఏమైతేనేం.! ‘విశ్వంభర’ ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కానుందనడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com