5,000 మంది క్యాబిన్ సిబ్బంది కోసం ఎమిరేట్స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌

- January 17, 2024 , by Maagulf
5,000 మంది క్యాబిన్ సిబ్బంది కోసం ఎమిరేట్స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌

యూఏఈ: దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ ప్రకటించింది. 2024లో 5,000 మంది క్యాబిన్ సిబ్బందిని నియమించుకోనుంది. ఎయిర్‌లైన్ ఇంటర్న్‌షిప్‌లు లేదా పార్ట్‌టైమ్ ఉద్యోగాల అనుభవం,  ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఆతిథ్యం లేదా కస్టమర్ సర్వీస్ అనుభవం ఉన్న తాజా గ్రాడ్యుయేట్‌ల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రకటించింది. ఎమిరేట్స్ క్యాబిన్ సిబ్బంది కోసం ఇంగ్లిష్ భాషలోఆంగ్లంలో నిష్ణాతులు, కనీసం 160cm ఎత్తు, కనీసం 1 సంవత్సరం హాస్పిటాలిటీ లేదా కస్టమర్ సర్వీస్ అనుభవం, కనీస ఉన్నత పాఠశాల (గ్రేడ్ 12) విద్య ఉన్నవారికి ప్రయారిటీ ఇవ్వనున్నారు. ఇందు కోసం ఎమిరేట్స్ రిక్రూట్‌మెంట్ బృందం ఆరు ఖండాల్లోని 460 కంటే ఎక్కువ నగరాల్లో ఓపెన్ డేస్ మరియు అసెస్‌మెంట్‌లను నిర్వహిస్తుందని ఎమిరేట్స్ తెలిపింది. 2023లో ఎమిరేట్స్ 353 నగరాల్లో రిక్రూట్‌మెంట్ ఈవెంట్‌లను నిర్వహించి 8,000 మంది క్యాబిన్ సిబ్బందిని నియమించుకుంది.  ప్రస్తుతం ఎయిర్‌లైన్ లో 21,500 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com