మెగా పవర్ వారసుడి తెరంగేట్రానికి సర్వం సిద్ధమేనా.?
- January 18, 2024
మెగా కాంపౌండ్ నుంచి ఆరడుగుల ఆజానుబాహుడిలా ఇంతవరకూ వరుణ్ తేజ్ పేరునే ప్రస్థావిస్తుంటాం. అవును, మెగా కాంపౌండ్ హీరోల్లో నాగబాబు తనయుడయిన వరుణ్ తేజ్ హైట్‌ని ఇంతవరకూ ఎవ్వరూ బీట్ చేయలేదు.
కానీ, ఇప్పుడు అదే కాంపౌండ్ నుంచి వస్తున్న మరో వారసుడు ఆ హైట్‌ని బీట్ చేసేశాడు. ఆయన మరెవరో కాదు. పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్.
ఈ మధ్య అకీరానందన్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నాడు. అకీరాకి మ్యూజిక్ అంటే ఇష్టం. కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు.. మెగా అభిమానులు తమ అభిమాన హీరో వారసుడ్ని హీరోగానే చూడాలనుకుంటున్నారు.
దాంతో, అకీరా నటనలోనూ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ పవన్ కళ్యాణ్ తన పవర్ స్టార్ అనే ట్యాగ్‌ని వదిలేశారు. ఇప్పుడదే ట్యాగ్‌తో కొడుకు అకీరాని అభిమానులు పిలుచుకుంటున్నారు.
అన్నీ కలిసొస్తే.. ఈ ఆరడుగుల ఆజానుబాహుడు.. కాదు కాదు అంతకన్నా ఎక్కువే.. హైటున్న ఈ మెగా రాకుమారుడు త్వరలోనే తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..