క్యాన్సర్ పేషెంట్లకు పుట్ట గొడుగులు ఓ వరం.! ఎందుకంటే.!

- January 18, 2024 , by Maagulf
క్యాన్సర్ పేషెంట్లకు పుట్ట గొడుగులు ఓ వరం.! ఎందుకంటే.!

వెజిటేరియన్స్‌కి నాన్‌వెజ్ ఫుడ్‌గా పిలవబడే పుట్టగొడుగుల్లో ఎన్నో పోషకాలున్నాయ్. ప్రోటీన్లతో పాటూ విటమిన్ ఏ, బి, విటమిన్ బి 12, విటమిన్ డి తదితర విటమిన్లు. వీటిలో పుష్కలంగా లభిస్తాయ్.

ముఖ్యంగా పుట్టగొడుగుల్ని రోగనిరోధక శక్తిని పెంపొందించే సహజ సిద్ధమైన ఆహారంగా చెబుతారు. పుట్టగొడుగుల్లో బీటా గ్లూకాన్స్ అధికంగా వుంటాయ్. వీటి ఇమ్యునోమోడ్యులేటనరీ ప్రభావం కారణంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే లక్షణాన్ని శరీరం మెరుగుపరుచుకోగలుగుతుంది.

ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు పుట్టగొడుగులు దివ్యౌషధంగా నిపుణులు చెబుతున్నారు. కీమో థెరఫీ లేదా రేడియేషన్  ట్రీట్‌మెంట్ తీసుకునే క్యాన్సర్ రోగుల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.

అందుకే క్యాన్సర్ రోగులు తమ డైట్‌లో పుట్టగొడుగులు చేర్చుకోవడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, కేవలం క్యాన్సర్ రోగులే కాదు, విటమిన్ డి సమస్యతో బాధపడేవారు కూడా పుట్టగొడుగుల్ని రెగ్యులర్‌గా తమ డైట్‌లో చేర్చుకోవడం వుత్తమమని చెబుతున్నారు. ఎందుకంటే, పుట్టగొడుగుల్లో విటమిన్ డి పుష్కలంగా వుంటుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com