21న ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు
- January 18, 2024అమరావతి: ఏపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల ఈనెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాణిక్కం ఠాకూర్ , మయప్పన్‌తో పాటు ఏపీకి చెందిన సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఏపీ లో త్వరలో ఎన్నికలు జరుగనున్న సమయంలో షర్మిలకు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి రాష్ట్రం వీడిపోయిన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలయ్యింది. విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి 102 సీట్లతో అధికారంలోకి రాగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కి 70 సీట్లు వచ్చాయి.
కాగా, 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి 175 సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది . టిడిపి 23 సీట్లు రాగా జనసేన ఒక స్థానం నుంచి గెలుపొందింది. ఈసారి అధికారంలో ఉన్న వైఎస్ జగన్‌ను ఓడించాలనే లక్ష్యంతో జగన్ సోదరి వైఎస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. తెలంగాణ వైఎస్సార్ పార్టీని స్థాపించి తెలంగాణలో ప్రచారం చేసుకున్న షర్మిల ఏ ఎన్నికల్లో పోటి చేయకుండానే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన 15 రోజుల్లో ఏపీకి చీఫ్‌గా నియమించడం రాజకీయంగా సంచలనం కలిగించింది .
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు