2020కి ముందు రెసిడెన్సీని ఉల్లంఘించిన వారికి గుడ్‌న్యూస్

- January 19, 2024 , by Maagulf
2020కి ముందు రెసిడెన్సీని ఉల్లంఘించిన వారికి గుడ్‌న్యూస్

కువైట్: 2020కి ముందు రెసిడెన్సీని ఉల్లంఘించిన వారి స్థితిని క్రమబద్ధీకరించడానికి.. నిర్దేశిత చట్టపరమైన జరిమానాలను చెల్లించడానికి అనుమతించడం ప్రారంభించినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికార వర్గాల కథనం ప్రకారం.. రెసిడెన్స్ అఫైర్స్ జనరల్ డిపార్ట్‌మెంట్‌లు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించాయి.  వచ్చిన దరఖాస్తులపై రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌ సమీక్షించిన తర్వాత చట్టాన్ని ఉల్లంఘించినవారికి 600 దీనార్ల జరిమానా చెల్లించే ప్రక్రియను సూచిస్తుంది.. జరిమానాను చల్లించిన తర్వాత సదరు వ్యక్తి తన పత్రాల పునరుద్ధరణను పూర్తి చేయడానికి, కొత్త రెసిడెన్సీని పొందడానికి పరిపాలన పరమైన అనుమతిని జారీ చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com