ఒమన్ లో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్
- January 19, 2024
మస్కట్: అల్ బురైమిలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్ ఖబూరాలోని విలాయత్‌లోని ఆరు ఇళ్లలో చోరీ చేసిన కేసులో మరోకరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. "అల్ ఖబూరా విలాయత్‌లోని ఆరు ఇళ్లలో బంగారు నగలు, మొబైల్ ఫోన్లు మరియు విలువైన వస్తువులను దొంగిలించిన వ్యక్తిని ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది" అని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. మరొక సందర్భంలో అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్, స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ సహకారంతో అల్ బురైమిలోని విలాయత్‌లోని ఎంటర్ టైన్ మెంట్ గేమ్స్ దుకాణాల్లో ఒకదానిలో గ్యాంబ్లింగ్ ఆటలను నిర్వహించడం, ఆడుతున్నందుకు ఒక పౌరుడిని, ఆసియా మరియు ఆఫ్రికన్ జాతీయులకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపింది. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







