రమదాన్ హెల్త్ డ్రైవ్ ప్రారంభం
- May 30, 2016
రమదాన్ సందర్భంగా ప్రత్యేక హెల్త్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, మేనేజ్‌మెంట్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్ ద్వారా ప్రారంభించింది. పవిత్ర రమదాన్ మాసంలో, ఉపవాస దీక్షల సందర్భంగా తీసుకునే ఆహారం పట్ల సరైన అవగాహనతో వ్యవహరించడం, ఆరోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండటం వంటి విషయాలపై ఈ హెల్త్ డ్రైవ్‌లో అవగాహన కల్పిస్తారు. ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ మరియు షాపింగ్ సెంటర్స్‌లో ఈ ఈవెంట్స్ నిర్వహిస్తారు. షార్జా కోఆపరేటివ్ సొసైటీ హల్వాన్ బ్రాంచ్, సిటీ సెంటర్ అజ్మాన్, ఫుజారియా సిటీ సెంటర్, అల్ ఇత్తిహాద్ మాల్, ఆర్‌ఎకె మాల్, మనామా హైపర్ మార్కెట్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్మార్ట్ షాపింగ్ ద్వారా హెల్త్ బెనిఫిట్స్‌పై ప్రాథమిక సమాచారాన్ని వినియోగదారులు తెలుసుకోగలుగుతారు. పండ్లు, కూరగాయలు, ప్రత్యామ్నాయ ఆహార పదార్థాల గురించి అవగాహన ముఖ్యం. అలాగే, ఈ సీజన్‌లో నూన ఎక్కువగా వినియోగించబడిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాల్టీ ఫుడ్‌ని కూడా తగ్గించాలి. బేక్డ్ మరియు గ్రిల్డ్ ఫుడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటిపైనా అవగాహనా కార్యక్రమాలుంటాయి. రమదాన్ మాసంలో సమతుల ఆహారం తీసుకోవడం, రోజూ 30 నిమిషాల పాటు ఫిజికల్ ఎక్సర్‌సైజులు చేయడం, స్మోకింగ్ మానేయడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సాఫ్ట్ డ్రింగ్స్ తీసుకోవడం, అతిగా తినడం వంటివి పూర్తిగా అదుపులో వుంటాయి రమదాన్ మాసంలో.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









