నాని ‘సరిపోద్దా శనివారం’.! ఏంటీ సంకెళ్ల గోల.!
- January 20, 2024
ఈ మధ్య సినిమా టైటిల్స్‌లో వారాలను బాగా వాడేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ‘మంగళవారం’ అనే సినిమా జనాల నోళ్లలో బాగా నానింది.
ఇప్పుడు నాని హీరోగా ‘సరిపోద్దా శనివారం’ అనే టైటిల్‌తో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మొన్నా మధ్య ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది చిత్ర యూనిట్.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ వివరాలను వెల్లడిస్తూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దిల్ రాజు ఏపీ, తెలంగాణాల్లో ఈ సినిమాని లార్జ్ స్కేల్లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.
కాగా, లేటెస్ట్ పోస్టర్లో సంకెళ్లతో బంధించబడిన నాని గట్టిగా అరుస్తూ.. కనిపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్లో భగ భగలాడే మంటలు కనిపిస్తున్నాయ్.
పోస్టర్ చూస్తుంటే ఇదేదో కాన్సెప్ట్ బేస్ మూవీలానే అనిపిస్తోంది. అదీ కాక, వివేక్ ఆత్రేయ సినిమాల్లో ఏదో కొత్త విషయం దాగుంటుంది. ‘అంటే సుందరానికి’ సినిమా ఎక్కడో తేడా కొట్టింది కానీ.! ఈ సారి సరిపోద్దా..శనివారం అంటూ.. ఫ్యాన్స్‌కి సరిపడా ట్రీట్ ఇచ్చేలానే వున్నాడాయన. చూడాలి మరి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!