ఏపీసీసీ కార్యాలయంలో సిద్ధమైన షర్మిల ఛాంబర్

- January 21, 2024 , by Maagulf
ఏపీసీసీ కార్యాలయంలో సిద్ధమైన షర్మిల ఛాంబర్

విజయవాడ: ఏపీసీసీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిలకు ఏపీసీసీ కార్యాలయంలో ఛాంబర్ సిద్ధమైంది. అలాతే ఆంధ్రరత్న భవన్‌లో షర్మిలకు ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఛాంబర్ వద్ద నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను ఈరోజు చేపడుతున్న నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, షర్మిళ ఫోటోలు ఏర్పాటు చేశారు.

కాగా వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. భారీ ర్యాలీగా విమానాశ్రయం నుంచి సభా వేదిక వద్దకు షర్మిల చేరుకోనున్నారు. షర్మిల ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు మాణిక్యం ఠాగూర్, మునియప్పన్, కృష్టఫర్ తిలక్, ఏపీసీసీ కీలక నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరవుతారు.

వైఎస్ షర్మిల గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కానూరు ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళతారు. కానూరులో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి ఆంధ్ర రత్న భవన్ పీసీసీ కార్యాలయానికి వచ్చి.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరిగి షర్మిల హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com