సత్యరాజ్‌ రామ్‌కి ఇది రెండో సినిమా ..

- May 31, 2016 , by Maagulf
సత్యరాజ్‌ రామ్‌కి ఇది రెండో సినిమా ..

కొద్దిరోజుల క్రితం వరకూ కోట శ్రీనివాస రావు, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అనే పదానికి పర్యాయ పదంగా ఉండేవారు. కోటగారికి వయసు పైబడడం, ప్రకాష్ రాజ్ నటుడిగా తక్కువ సినిమాలు చేస్తూ, దర్శకత్వం వైపు దృష్టి సారిస్తుండటంతో వారి స్థానాన్ని రావు రమేష్, సత్యరాజ్, మురళీ శర్మ భర్తీ చేస్తున్నారు. అందులోను ఎవరికి వారు తమదైన శైలిని ఏర్పరచుకోవడం విశేషం. ప్రస్తుత విషయానికొస్తే.. 'శంఖం', 'మిర్చి', 'తుంగభద్ర' తదితర సినిమాల్లో నటంచిన సత్యరాజ్ తెలుగులో చక్కటి అవకాశాల్ని అందిపుచ్చకుంటున్నారు. బాహుబలిలో ఆయన చేసిన కట్టప్ప పాత్ర ఆయనకి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందో తెలిసిందే. తాజాగా రామ్-సంతోష్ శ్రీనివాస్ చేస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రకు ఎంపకయ్యారట. ఇటు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తోను అటు సత్యరాజ్‌తోనూ రామ్‌కి ఇది రెండో సినిమా కావడం గమనార్హం. సంతోష్ శ్రీనివాస్‌తో కందిరీగ సినిమా, సత్యరాజ్‌తో కలిసి నటించిన 'నేను శైలజ' సినిమా రామ్‌కి కొత్త ఇన్నింగ్స్‌లా మారింది. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. జిబ్రాన్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా జూన్ 3 నుండి సెట్స్ మీదికి వెళ్ళనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com