బంగారం స్మగ్లింగ్ ఆపరేషన్‌ భగ్నం.. Dh800,000 విలువైన ఆభరణాలు స్వాధీనం

- January 31, 2024 , by Maagulf
బంగారం స్మగ్లింగ్ ఆపరేషన్‌ భగ్నం.. Dh800,000 విలువైన ఆభరణాలు స్వాధీనం

యూఏఈ: షార్జా పోలీసులు 800,000 దిర్హామ్‌ల విలువైన ఆభరణాలతో కూడిన భారీ బంగారం స్మగ్లింగ్ ఆపరేషన్‌ను అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఖోర్‌ఫక్కన్‌లోని ఓ దుకాణంలో అర్థరాత్రి నగలు దోచుకెళ్లారు. షార్జా పోలీస్ ఆపరేషన్స్ రూమ్ కి సమాచారం అందింది. వెంటనే నేరం జరిగిన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. సాక్ష్యాలను సేకరించి దర్యాప్తు చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని గంటలపాటు విచారణ జరిపిన బృందం దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులను గుర్తించారు. దొంగిలించబడిన నగలను కూడా ఓడరేవులో షిప్పింగ్ కంటైనర్‌లో పోలీసులు గుర్తించారు. మరుసటి రోజు ఉదయం దేశం నుండి రవాణా చేయడానికి అది సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ముఠా సభ్యులను అరెస్టు చేయడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు అరెస్టయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కేసును ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. వాణిజ్య సంస్థల యజమానులు తమ దుకాణాలకు భద్రతను ఏర్పాటు చేసుకోవాలని, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని. షార్జా పోలీసులు పిలుపునిచ్చారు. ఇలాంటి సంఘటనలను నివేదించడానికి ఎమర్జెన్సీ నంబర్ 999ని ఉపయోగించాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com