మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం..
- January 31, 2024
కౌలాలంపూర్: మలేషియాకు కొత్త రాజు వచ్చారు. కౌలాలంపూర్ లోని జాతీయ ప్యాలెస్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో మలేషియా దక్షిణ రాష్ట్రమైన జోహోర్ కు చెందిన సుల్తాన్ ఇబ్రహీం దేశ నూతన రాజుగా ప్రమాణ స్వీకారం చేశారు. మలేషియాలో ఇంకా రాచరికం కొనసాగుతున్నప్పటికీ అది ఉత్సవ విగ్రహ పాత్రనే పోషిస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల కిందట నుంచి దాని ప్రభావం కూడా పెరిగింది. ఇక్కడి రాజుకు విచక్షణాధికారాలు ఉంటాయి. రాజకీయ అస్థిరతను అణచివేయడానికి ఆ అధికారులు ఇటీవల ఉపయోగపడుతున్నాయి.
మలేషియాలో ప్రత్యేకమైన రాచరిక వ్యవస్థ అమల్లో ఉంది. తొమ్మిది రాజకుటుంబాల అధిపతులు ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక సారి రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిని ‘‘యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్’’ అని పిలుస్తారు.
తాజాగా రాజుగా మారిన 65 ఏళ్ల సుల్తాన్ ఇబ్రహీం..అల్ సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా స్థానంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన పహాంగ్ కు నాయకత్వం వహిస్తూ ఇటీవలే తన ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే రాచరికం ఎక్కువగా రాజకీయాలకు అతీతంగా కనిపించినప్పటికీ.. సుల్తాన్ ఇబ్రహీం ముక్కుసూటి మనషిగా, బహిరంగ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన తరచు దేశ రాజకీయ సమస్యలపై దృష్టి నిలిపేవారు.
భారీగా విలాసవంతమైన కార్లు, మోటారు సైకిళ్లను తన కలెక్షన్ లో ఉంచుకునే ఆయనకు రియల్ ఎస్టేట్ నుండి మైనింగ్ వరకు విస్తృతమైన వ్యాపారాలు ఉన్నాయి. జోహోర్ వద్ద 100 బిలియన్ డాలర్ల చైనా మద్దతుతో భూ పునరుద్ధరణ, డెవలప్ మెంట్ ప్రాజెక్టులో సుల్లాన్ ఇబ్రహీంకు ఫారెస్ట్ సిటీలో వాటా కూడా ఉంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









