‘భైరవకోన’లో ‘ఈగల్’ లొల్లి.!

- January 31, 2024 , by Maagulf
‘భైరవకోన’లో ‘ఈగల్’ లొల్లి.!

సందీప్ కిషన్ తాజా సినిమా ‘ఊరు పేరు భైరవకోన’ వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ మధ్య టాలీవుడ్‌లో సినిమాల రిలీజ్‌ల విషయంలో ఏదో ఒక లొల్లి జరుగుతూనే వుంది. సంక్రాంతి సినిమాల రిలీజుల విషయంలో నిర్మాతల మధ్య రక రకాల మంతనాలు జరిగాయ్.
ఆ క్రమంలో కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కొన్ని సినిమాలు నిరంతర పోరాటం సలిపి ఎలాగోలా రిలీజ్ రేస్‌లో నిలబడిన సంగతి తెలిసిందే.
అలా సంక్రాంతి రేస్ నుంచి పక్కకు తప్పుకున్న సినిమాలో మాస్ రాజా రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా ఒకటి. ఫిబ్రవరిలో సోలో రిలీజ్ ఇప్పించే ఒప్పందంపై ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఆగింది.
ఫిబ్రవరి 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే, అనూహ్యంగా అంతకు ముందే రిలీజ్ ప్లాన్ చేసుకున్న సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ కూడా అదే స్లాట్‌లో వుండడంతో.. మల్లీ లొల్లి మొదటికొచ్చింది.
దాంతో, అప్పుడు ‘ఈగల్’ టీమ్‌కిచ్చిన ఒప్పందం నెరవేర్చడం కోసం ‘ఊరు పేరు భైరవకోన’ నిర్మాతలు ఇప్పుడు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆల్రెడీ రెండు సార్లు పోస్ట్‌పోన్ చేసుకున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది తాజాగా.
ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విషయమున్న దర్శకుడు వి.ఐ.ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్.. సందీప్ కిషన్‌కి జోడీగా నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com