ఇరాన్-సిరియాలో అమెరికా ప్రతీకార దాడులు-18 మంది మృతి
- February 03, 2024
అమెరికా: ఇటీవల జోర్డాన్ లో తమ క్యాంప్‌పై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా ప్రతిదాడులు మొదలు పెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. దీంతో సిరియాలో 18 మంది మిలిటెంట్లు మృతి చెందారు.
మిలిటెంట్లకు చెందిన కమాండ్ కంట్రోల్ ప్రధాన కేంద్రంతోపాటు ఇంటెలిజెన్స్ కేంద్రాలు, రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లు, ఆయుధ సామాగ్రి నిల్వల గోడౌన్లు, లాజిస్టిక్స్ సౌకర్యాలపై దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన సమాధానం ఇస్తామని ఈ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఆదివారం జోర్డాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని ఆయన చెప్పారు. జోర్డాన్‌లోని అమెరికా సైనిక క్యాంప్‌పై ఇటీవల డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు అమెరికా సైనికులు మృతిచెందగా, సుమారు 40 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ దాడులు జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







