మనామాలో 18వ స్ప్రింగ్ ఆఫ్ కల్చర్ ఫెస్టివల్‌..వారానికో థీమ్

- February 03, 2024 , by Maagulf
మనామాలో 18వ స్ప్రింగ్ ఆఫ్ కల్చర్ ఫెస్టివల్‌..వారానికో థీమ్

బహ్రెయిన్: 18వ స్ప్రింగ్ ఆఫ్ కల్చర్ ఫెస్టివల్‌లో భాగంగా మనామా పోస్ట్ ఆఫీస్‌లో "ఫ్రమ్ ద పోస్ట్" సాంస్కృతిక కార్యకలాపాలు తిరిగి వస్తోంది. ఫిబ్రవరి నెలంతా ప్రతి శనివారం వైవిధ్యభరితమైన ఈవెంట్‌లకు కేంద్రంగా మారనుంది. ఈ ప్రత్యేకమైన అనుభవం సంస్కృతి మరియు చరిత్రను ఒకేచోటకు తీసుకురానుంది. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ (BACA) సహకారంతో బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA)  నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ మనామా యొక్క గొప్ప సంస్కృతి, వారసత్వంతో ప్రజల అనుబంధాన్ని మరింతగా పెంచడం ఈ కార్యాచరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పురాతన నగరం యొక్క చరిత్ర, మార్కెట్లు, పురాతన గ్రామాలు, కళలు మరియు వాస్తుశిల్పంపై ఫోకస్ చేయనుంది. ప్రతి శనివారం "ఆర్కిటెక్చరల్ హెరిటేజ్" పేరుతో నిర్వహించే వేడుకలు ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్నాయి. మొదటివారం “టెక్స్‌టైల్: ట్రేడ్ ఇన్ మనామా”  థీమ్ తో నిర్వహిస్తున్నారు. టూర్ రిజిస్ట్రేషన్‌లు, మరింత సమాచారం కోసం  www.culture.gov.bh వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com