అబుధాబిలో భారత ప్రధానిని కలవడానికి 60వేల మంది రిజిస్టర్

- February 03, 2024 , by Maagulf
అబుధాబిలో భారత ప్రధానిని కలవడానికి 60వేల మంది రిజిస్టర్

యూఏఈ: ఫిబ్రవరి 13న అబుధాబిలో భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న కమ్యూనిటీ ఈవెంట్ ‘అహ్లాన్ మోదీ’కి హాజరయ్యేందుకు 60,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భారత ప్రధాని యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి. జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మెగా కమ్యూనిటీ ఈవెంట్.. అబుదాబిలో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ రాతి ఆలయాన్ని ప్రారంభించటానికి ఒక రోజు ముందు నిర్వహిస్తున్నారు. అహ్లాన్ మోదీ కార్యక్రమంలో భారతీయ కళల వైవిధ్యాన్ని ప్రదర్శించే 700 మందికి పైగా సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ పాఠశాల విద్యార్థులు, భారత కమ్యూనిటీ సభ్యులు నిర్వాహకులు తెలిపారు. "అహ్లాన్ మోడీ కేవలం ఒక కార్యక్రమం కాదు. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి సంబంధించిన వేడుక. సరిహద్దుల్లో ప్రతిధ్వనిస్తుంది." అని శోభా రియాల్టీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ పీఎన్ఎస్ మీనన్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com