ఏపీ: దళిత మహిళ ఇల్లు కూల్చివేత...

- February 04, 2024 , by Maagulf
ఏపీ: దళిత మహిళ ఇల్లు కూల్చివేత...

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఓ దళిత మహిళ ఇంటిని వైకాపా నాయకుడు మాజీ ఎం.ఎల్.ఎం అనుచరులు కూల్చిన ఘటన అనంతపురంలోని కృపానందనగర్ లో శుక్రవారం చోటు చేసుకుంది.ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామునే సదరు నాయకుని అనుచరులు పొక్లెయిన్,రెండు ట్రాక్టర్లతో వచ్చి దౌర్జన్యంగా ఇంటిని ధ్వంసం చేశారు.అడ్డుకోబోయిన బాధితులు లక్ష్మీదేవి,వెంకటలక్ష్మిలను పక్కకు తోసి మరి కూల్చి వేశారు.

 

లక్ష్మీదేవి తెలిపిన వివరాలమేరకు...తాము 35 ఏళ్లుగా నివసిస్తున్నామన్నారు.సదరు ఇంటి స్థలానికి సంబంధించి ఇంటి,నీటి పనులు చెల్లిస్తూ వచ్చామన్నారు.తన పేరు మీద 2004లో మూడు సెంట్లు మంజూరు చేస్తూ రెవిన్యూ అధికారులు మంజూరు చేశారన్నారు.ఆ స్థలంలోనే తాము ఇల్లు నిర్మించుకున్నామని తెలిపారు. మాజీ ఎం.ఎల్.ఎం గురునాథ రెడ్డి అనుచరులు స్థలం తమది అంటూ దౌర్జన్యంగా ప్రవేశించి మహిళలని చూడకుండా లాగేసి ఇంటిని పడగొట్టారని కన్నీటి పర్యవంతమయ్యారు.రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.ఈ స్థలాన్ని సర్వే నంబరు: 264/1 మాజీ ఎం.ఎల్.ఎం గురునాథ రెడ్డి సోదరుడు రెడ్డప్పరెడ్డి 1984లో గోరంట్లకు చెందిన టి.ఎస్ మల్లికార్జున నుంచి 13 సెంట్లు కొనుగోలు చేశారని అందుకు సంబంధించిన దస్త్రాలు తమ వద్ద ఉన్నాయని, ఆధారాలతోనే కూల్చి వేశామని మాజీ ఎం.ఎల్.ఎం ప్రతినిధి తెలిపారు.దుబాయ్ లో నివసిస్తున్న లక్ష్మీదేవి అల్లుడు అశోక్ ఉన్నతాధికారులను తమకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు.సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతీసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని బాధితులు కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com