'లాల్ సలాం’ మూవీ ట్రైలర్ విడుదల..
- February 05, 2024
చెన్నై: సౌతిండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ కీలకపాత్ర పోషించిన ‘లాల్ సలాం’ మూవీ ట్రైలర్ విడుదలైంది. విష్ణు విశాల్ – విక్రాంత్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. ఐశ్వర్య రజనీకాంత్ ‘లాల్ సలామ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో నడిచే కథగా దీన్ని రూపొందిస్తున్నారు.
మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో కనిపిస్తారు. లైకా నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. రజినీ ఈ సినిమాలో మోయిద్దీన్ భాయ్ అనే పాత్రలో కనపడుతున్నారు.
రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత రజినీ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. మోయిద్దీన్ భాయ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇందులో రజినీకీ సోదరిగా జీవిత నటిస్తున్నారు.
ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ బాణీలు సమకూర్చారు. రజినీకాంత్ పాత్రను ఈ సినిమా కోసం తీర్చిదిద్దిన తీరు ఫ్యాన్స్‌లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్లు విశేషంగా అలరించాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







