తలలో చుండ్రు బాగా వేధిస్తోందా.? మీకోసమే ఈ చిన్న టిప్.!

- February 06, 2024 , by Maagulf
తలలో చుండ్రు బాగా వేధిస్తోందా.? మీకోసమే ఈ చిన్న టిప్.!

వచ్చిందీ.. చుండ్రు మిమ్మల్ని నలుగురిలో తిరగనివ్వడం లేదా.? అంటూ రకరకాల వాణిజ్య ప్రకటనలు చూస్తుంటాం డేండ్రఫ్‌కి సంబంధించి. ఆయా ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకునేలా ఆయా యాడ్ షూట్స్ చేస్తుంటారు.

అయితే, డేండ్రఫ్‌కి సంబంధించి అనేక రకాల షాంపూలు మార్కెట్లో అందుబాటులో వున్నాయ్. కానీ, వాటితో డేండ్రఫ్ తాత్కాలిక పరిష్కారమే అవుతుంది. అంతేకాదు, జుట్టు రాలిపోవడం.. తెల్లబడడం వంటి అనేక ఇతరత్రా సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకే సహజ సిద్ధంగా డేండ్రఫ్ కంట్రోల్ చేసుకునే చిట్కా ఒకటి మీకోసం.
కరివేపాకులోని సహజ సిద్ధమైన పోషకాలు జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయ్. అలాగే తమలపాకు ఆరోగ్యానికే కాదు.. జుట్టును కాపాడేందుకు కూడా ఉపయోగపడుతుంది.

కొబ్బరి నూనెలో కొద్దిగా కరివేపాకు ఆకుల్ని వేసి, అందులోనే నాలుగైదు తమలపాకులు వేసి బాగా మరిగించాలి. నూనె రంగు నల్లబడేంతవరకూ మరిగించాలి. చల్లారాక ఈ నూనె మిశ్రమాన్నిగాజు సీసాలో వేసి భద్రపరుచుకోవాలి.

ప్రతీరోజూ ఈ నూనెను తలకి పట్టించి బాగా మర్దన చేస్తే.. జుట్టు కుదుళ్ల వరకూ ఇంకి డేండ్రప్‌ని తగ్గిస్తుంది. తద్వారా జుట్టు రాలడాన్ని కూడా నియంత్రిస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com