బహ్రెయిన్ అక్రమ శ్రామికులకు 6నెలల క్షమాభిక్ష కాలవ్యవధి

- June 29, 2015 , by Maagulf
బహ్రెయిన్ అక్రమ శ్రామికులకు 6నెలల క్షమాభిక్ష కాలవ్యవధి

ద  లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ ఆధారిటీ (LMRA) వారు శనివారం, జూన్-27న  అక్రమ శ్రామికులు బహ్రెయిన్ లో వారి ఉనికిని చట్టబద్ధం చేసుకునేందుకు లేదా  విధమైన జరిమాన చెల్లించనవసరం లేకుండా, బ్లాక్ లిస్టులోకి చేరకుండా వారి స్వదేశాలకు తరలిపోయేందుకు  వీలు కల్పిం చారు.జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు క్షమాభిక్షకు గడువు విధించింది. 

 ప్రకటించిన వివరాల ప్రకారం, వీరికి ఆరునెలలపాటు క్షమాభిక్ష కాలవ్యవధిని ప్రసాదించింది. ఈ కాలవ్యవధిలో బహ్రెయిన్ ను విడిచి వెళ్లినవారు మరల ఏ ఆటంకము లేకుండా ఇక్కడికి తిరిగి రావచ్చు. LMRA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఔషామ అలాబ్సీ- అక్రమంగా నివాసముంటూ, దోపిడీకీ గురౌతున్న శ్రామికులకు ఏ విధమైన కష్టనష్టాలకు గురికాని కొత్త ప్రారంభాన్నివ్వాలనే ఉద్దేశంతో వారు ఉన్నట్టు తెలిపారు. ఇందుకు గాను నేష నాలిటీ, పాస్పోర్టు అండ్ రెసిడెన్స్ ఆఫైర్స్ హెడ్ క్వార్టర్స్లో మాత్రమే, ఇమ్మిగ్రేషన్ అధికారుల ఎక్స్ టెన్షన్ పొందాలని ఆయన వివరించారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com