రోజూ ఒక లవంగా తింటే.. ఆ సమస్యలన్నీ దూరమవుతాయా.?
- February 15, 2024
మసాలా సామాగ్రిలో లవంగాలది అతి ముఖ్యమైన స్థానం. అయితే లవంగాలు కేవలం మసాలా ఐటెం మాత్రమే కాదండోయ్. ఎన్నో దీర్ఘ కాలిక వ్యాధులను తగ్గించే మందుల్లో వాడుతుంటారు లవంగాల్ని. ఆయుర్వేదంలోనూ లవంగాలకు ప్రత్యేకమైన స్థానం వుంది.
అయితే, మసాలా పరంగా అప్పుడప్పుడూ మాత్రమే లవంగాల్ని వాడుతుంటాం. కానీ, ప్రతీరోజూ ఓ పచ్చి లవంగాని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
లవంగాల్లో వుండే ఇన్‌ఫ్లామేటరీస్ బరువు తగ్గించేందుకు ఉపయోగపడతాయ్.
అంతేకాదు, లవంగాల్లో వుండే, ఒక ప్రత్యేకమైన ఎంజైమ్.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది.
క్రమం తప్పకుండా లవంగాలు తినే వారికి మలబద్ధకం సమస్య రానే రాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, పచ్చి లవంగాని పంటి కింది వుంచి రోజంతా చప్పరిస్తే.. నోటి దుర్వాసన రాకుండా వుంటుంది.
అలాగే ఎటువంటి దంత సమస్యలైనా దూరమైపోతాయని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







