ప్రశాంత్ వర్మకి హనుమంతుడు దొరికేశాడా.?
- February 15, 2024
‘హనుమాన్’ సినిమాతో వచ్చిన హిట్టుకి.. తదుపరి పార్ట్ ‘జై హనుమాన్’పై ఆటోమెటిగ్గా అంచనాలు పెరిగిపోయాయ్. ఆ అంచనాల్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ రోజు రోజుకూ మరింత పెంచేస్తున్నాడు.
ఈ సినిమాలో ఓ స్టార్ హీరో హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడు.. అన్న అనౌన్స్‌మెంట్‌తోనే సినిమాపై అంచనాలు ఆకాశానికంటేలా చేశాడు ప్రశాంత్ వర్మ.
ఇక అక్కడితో మొదలైన ‘జై హనుమాన్’ హైక్ అంతకంతకూ పెరిగిపోతూ వస్తోంది. మొదటి ఆ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కాదు కాదు రానా అన్నారు.
ఇప్పుడు కన్నడ స్టార్ హీరో, ‘కేజీఎఫ్’తో ప్యాన్ ఇండియా గుర్తింపున్న హీరో యష్ పేరు గట్టిగా వినిపిస్తోంది. వాస్తవానికి ‘హనుమాన్’ కోసమే ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిని అడిగాడట. ఆయన నో అనేసరికి ఆ పాత్రను గ్రాఫిక్స్‌తో కానిచ్చేశాడు.
కానీ, ‘జై హనుమాన్’లో హనుమాన్ పాత్రే అత్యంత కీలకం. సో, ఆ పాత్ర చుట్టూనే అంచనాలు తిరుగుతున్నాయ్. యష్ పేరు బయటికి రాగానే రెస్పాన్స్ పాజిటివ్‌గా అందుతోంది. అయితే, ఇది కూడా కేవలం ప్రచారం మాత్రమే. అధికారికంగా ప్రశాంత్ వర్మ అండ్ టీమ్ అనౌన్స్ చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







