బిజీ బిజీగా ప్రియమణి.!
- February 15, 2024అందాల నటి ప్రియమణి.. కేవలం అందమే కాదు.. మంచి టాలెంట్ వున్న నటి కూడా. హీరోయిన్గా రాణించడంతో పాటూ.. అప్పుడప్పుడూ కొన్ని స్పెషల్ సాంగ్స్‌లోనూ నర్తించి మెప్పించింది.
ఇక ఇప్పుడు అప్పుడప్పుడూ సినిమాలతో పాటూ, ఓటీటీపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది ప్రియమణి. ఓటీటీలో చిన్న చిన్న సినిమాలతో పాటూ, సిరీస్‌ల్లోనూ సత్తా చాటుతోంది.
ఓ మలయాళ సినిమాలో మొన్నా మధ్య మోహన్ లాల్‌కి పోటీగా నటించి మెప్పించింది. తాజాగా ‘భామా కలాపం’ అనే తెలుగు వెబ్ సిరీస్‌తో రాబోతోంది. ఆల్రెడీ ఈ సిరీస్‌కి సంబంధించి మొదటి పార్ట్ గతంలో ఓటీటీ ప్రేక్షకులచే మంచి ఆదరణ పొందింది.
తాజాగా ‘భామా కలాపం 2’ స్ర్టీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఓ సాధారణ గృహిణి.. చేసే సాహసాలను కాస్త హ్యూమరస్‌గా తెరకెక్కించారు. మొదటి పార్ట్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రెండో పార్ట్‌లో ప్రియమణి ఎలా సత్తా చాటింది.? ప్రేక్షకుల ప్రశంసలు ఎలా వున్నాయ్ తెలియాల్సి వుంది.
మొదటి పార్ట్ ఆదరణను బట్టి.. రెండో పార్ట్ పైనా ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయ్. ఈ సిరీస్‌ని ప్రమోట్ చేసే విధానం కూడా ఆకట్టుకుంటోంది. సో, చూడాలి మరి, అనుపమగా ‘భామా కలాపం 2’లో ప్రియమణి టాలెంట్ ఎంత మేర వర్కవుట్ అయ్యిందో. అన్నట్లు ఈ సిరీస్‌లో సీరత్ కపూర్, శరణ్య ఇతర కీలక పాత్రల్లో ప్రియమణికి సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..