మైగ్రేన్ నుంచి ఉపశమనానికి ఇంటి చిట్కాలు.!
- February 18, 2024
తలనొప్పి యందు మైగ్రేన్ తలనొప్పి వేరయా.! అనొచ్చేమో. అంతలా దీని బాధ వేదిస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా కొన్ని సందర్భాల్లో మైగ్రేన్ నుంచి తాత్కాలిక ఉపశమనం కూడా పొందలేము.
అలాంటి పరిస్థితుల్లోనే కొన్ని ఇంటి చిట్కాలు తాత్కాలిక ఉపశమనం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ నుంచి తప్పించుకోవడానికి కొందరయితే, పండు మిర్చితో తలపై పట్టులా వేసుకుంటారు. మిర్చి చిన్న ముక్క తగిలితేనే ముఖంపై సున్నితమైన చర్మం మండిపోతుంది. అలాంటిది, మిర్చి పట్టు.. అంటే ఆ మంట ఏ స్థాయిలో వుంటుంది.
కానీ, మైగ్రేన్ బాధితులకి పండు మిర్చి మంట కన్నా.. మైగ్రేన్ తలనొప్పి బాధే ఎక్కువ అని ప్రాక్టికల్‌గా కొన్ని సర్వేల్లో తేలింది. అయితే, కొందరు ఐస్ ముక్కలు పెట్టి తాత్కాలిక ఉపశమనం పొందుతారు.
అలాగే, ఆవాలతో పట్టు వేస్తే కాస్త ఉపశమనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఆవాలను ముద్దలా నూరి నుదుటిపై మైగ్రేన్ వున్న వైపు పూతలా పూసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
అలాగే, టీ, కాఫీల జోలికి పోకూడదు మైగ్రేన్ బాధితులు. వాటి స్థానంలో కొత్తిమీర కలిపిన గ్రీన్ టీ తీసుకుంటే ఉపశమనం వుంటుంది. అలాగే చల్లని పానీయాల జోలికి కూడా పోకూడదు. చల్లటి గాలి తగలకుండా చూసుకోవాలి. గాలి వెలుతురు సక్రమంగా తగిలే వాతావరణంలో వుండాలి. డి విటమిన్ తగిలేలా ఉదయం, సాయంత్రం ఎండకు కాస్త ఎక్స్‌పోజ్ అవ్వాలి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







