నిజామాబాద్‌వాసికి దక్కిన అరుదైన గౌరవం

- June 29, 2015 , by Maagulf
నిజామాబాద్‌వాసికి దక్కిన అరుదైన గౌరవం

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి గ్రామానికి చెందిన బోగ నిత్యానంద్, అరుణ దంపతుల పెద్ద కూతురు విశ్వశ్రీ త్రిపురలోని అగర్తలా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2014 జూన్ 12న వెలువడిన యూపీఎస్సీ ఫలితాలలో విశ్వశ్రీ సివిల్స్‌కు ఎంపికయ్యూరు. ఇండియన్ రైల్వే ట్రాక్ సర్వీస్ (ఐఆర్‌టీఎస్) శిక్షణలో ఉండగానే సివిల్స్ రాసి 346 ర్యాంక్ సాధించారు. భర్త నక్క భానుశ్యాం ఉద్యోగ రీత్యా డిల్లీ లో స్థిరపడడంతో అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచే సివిల్స్ పరీక్ష రాసి ఎంపికయ్యూరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com