ఫిబ్రవరి 26 నుండి వెబ్ సమ్మిట్ ఖతార్
- February 24, 2024
దోహా: మిడిల్ ఈస్ట్‌లో మొట్టమొదటిసారిగా వెబ్ సమ్మిట్ ఖతార్ ప్రారంభ ఎడిషన్ జరుగనుంది. ఇది ఫిబ్రవరి 26 నుండి 29వరకు దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు వెబ్ సమ్మిట్ ఖతార్ 2024 ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, షేక్ జాసిమ్ బిన్ మన్సూర్ బిన్ జబోర్ అల్ థానీ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ఇ షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ.. ఖతార్ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థపై మాట్లాడతారని ఆయన చెప్పారు. ఎమ్మీ-విజేత హాస్యనటుడు ట్రెవర్ నోహ్, WPP CEO మార్క్ రీడ్, హూప్ CEO విల్ అహ్మద్, వ్యోమగామి మరియు డీప్ స్పేస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు సారా సబ్రీ, రిప్లిట్ సహ వ్యవస్థాపకుడు మరియు CEO అమ్జద్ మసాద్తో సహా పలువురు ప్రముఖ వక్తలు, ఇండస్ట్రీ లీడర్స్ ఇందులో పాల్గొంటాని తెలిపారు. 80 దేశాల నుండి 1,000 కంటే ఎక్కువ స్టార్టప్‌లతో.. ఖతార్, యుఎస్, ఈజిప్ట్, బ్రెజిల్, ఇటలీ, నైజీరియా, యూకే, భారతదేశం వంటి దేశాల నుండి వచ్చిన 00 మందికి పైగా పెట్టుబడిదారులు, భాగస్వాములతో కనెక్ట్ అయ్యే ఈ ఈవెంట్ ఈ ప్రాంతంలో ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద మరియు విభిన్నమైన ఈవెంట్ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









