అయ్యో పాపం.! బుజ్జీమాకి ఎంత కష్టమొచ్చిందో.!
- February 24, 2024
బుజ్జీమా.. బుజ్జీమా.. అంటూ శర్వానంద్‌తో ముద్దు ముద్దుగా పొగిడించుకున్న ముద్దుగుమ్మ సీరత్ కపూర్. అదేనండీ.! ‘రన్ రాజా రన్’ సినిమాలో శర్వానంద్‌కి జోడీగా నటించిన భామ.
తొలి సినిమా సూపర్ హిట్టే ఈ ముద్దుగుమ్మకి. ఆ తర్వాత కూడా అవకాశాలు బాగానే వచ్చాయ్. కానీ, అవేమీ పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు కాకపోవడం విశేషం. ఏకంగా నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోలతోనూ నటించేసినా.. సీరత్ కపూర్‌ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు.
చిన్నా చితకా సినిమాల్లోనూ నటించింది కానీ, స్టార్డమ్ దక్కించుకోలేకపోయింది. తాజాగా ‘భామా కలాపం 2’ అనే ఓటీటీ మూవీలో సీరత్ కపూర్ నటించింది.
ప్రియమణి లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాలో సీరత్ కపూర్‌కి కేవలం గ్లామర్ డాళ్‌గా మాత్రమే వాడారు. విపరీతమైన హాట్ నెస్ పండించేసింది ఆ పాత్రలో సీరత్ కపూర్. అలాగే ఓ స్పెషల్ సాంగ్‌లోనూ చిందేసింది. కానీ, ఈ పాత్ర సీరత్ కెరీర్‌కి పెద్దగా యూజ్ అయ్యే పాత్రేమీ కాదు. చిన్న పాత్రే కానీ.. పెద్దగా ఇంపార్టెన్స్ దక్కకుండా పోయింది.
రాక రాక వచ్చిన ఛాన్స్ కూడా సీరత్‌కి ఇలా యూజ్లెస్ అయిపోయింది. దాంతో, కొద్దో గొప్పో సీరత్ని అభిమానించేవాళ్లు సైతం కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









