‘హాఫ్ లయన్’ పై అందరిలోనూ పెరిగిన ఆసక్తి
- February 28, 2024
హైదరాబాద్: మాజీ భారత ప్రధాని పి.వి. నరసింహ రావు కి ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం "భారతరత్న" ప్రకటించిన సంగతి తెలిసిందే.1991 నుంచి 1996 వరకు ఆయన అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం ‘భారతరత్న’ అవార్డును ప్రకటించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కొత్తపుంతలు తొక్కించటంలో ఆయనెంతో కీలకంగా వ్యవహరించారు.
ఇదే సమయంలో ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ కలిసి మన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు బయోపిక్ ‘హాఫ్ లయన్’ను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. పలు భాషలలో రూపొందుతున్నఈ బయోపిక్ పి.వి.నరసింహారావు జీవిత చరిత్రను వివరిస్తుంది. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన 'హాఫ్ లయన్' పుస్తకం ఆధారంగా,జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రకాష్ ఝా ఈ సిరీస్‌కు రూపోందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియాన్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు.
పి.వి.నరసింహారావు గొప్ప జీవన ప్రయాణాన్ని ఇది హైలైట్ చేయనుంది.దీంతో‘హాఫ్ లయన్’కు సంబంధించిన మునుపటి ప్రకటనకు మరింత ప్రాముఖ్యత పెరిగింది.
తాజా వార్తలు
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో గ్రాండ్ దీపావళి గాలా..!!
- MTCIT బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు 3వ ఎడిషన్ ప్రారంభం..!!
- టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!
- భారత్‌లో మెటా అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభం
- ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు...
- మెంటల్ హాస్పటల్‌గా రుషికొండ ప్యాలెస్?