వేసవిలో మొటిమల బెడద తగ్గించుకునే టిప్స్.!

- February 29, 2024 , by Maagulf
వేసవిలో మొటిమల బెడద తగ్గించుకునే టిప్స్.!

వేసవిలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల మొటిమల బాధ కూడా ఎక్కువగా వుంటుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే, చిన్న చిన్న కొన్ని టిప్స్ పాఠిస్తే సరిపోతుంది.

తరచూ చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ వుండాలి. సమ్మర్‌లో మేకప్ ప్రొడక్టులు కాస్త తక్కువగా వినియోగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, ఎండ నుంచి ముఖాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించే స్కార్ఫ్‌లు, కూలింగ్ గ్లాసెస్‌ని ఎప్పటికప్పుడు శుభ్రంగా వుంచుకోవాలి.

మొటిమల్ని గిల్లడం, రుద్దడం వంటి చేయరాదు. అలా చేస్తే అవి ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదముంది. అలాగే వీలైనంత తక్కువ సార్లు మాత్రమే చేతితో ముఖాన్ని తాకుతుండాలి.

మొబైల్ ఫోన్‌ని సైతం ముఖానికి దూరంగా వుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అమ్మాయిలు రాత్రి పడుకునే ముందు మేకప్ తొలగించుకుని నిద్రపోవాలి.

అబ్బాయిలు షేవింగ్ చేసుకునే ముందు ముఖాన్నీ, గడ్డాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత షేవింగ్ క్రీమ్ అప్లై చేయాలి. ఆ పై షేవింగ్ చేసుకోవాలి.

మొటిమలు అధికంగా రావడానికి పొల్యూషన్ ఓ కారణమైతే, ఒత్తిడి, ఆందోళన ఇంకో కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి అధికంగా వుండడం వల్ల కార్డిసోల్, అడ్రిసలిస్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయ్. తద్వారా మొటిమలు వస్తాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com