ఇట్స్ ఏన్ అఫీషియల్.! పేరెంట్స్ కాబోతున్న ఆ బాలీవుడ్ క్యూట్ జంట.!
- February 29, 2024
సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ వార్త ట్రెండింగే. వారి ప్రేమ వార్త కావచ్చు. పెళ్లి వార్త కావచ్చు.. అలాగే పిల్లలు పుట్టడం కావచ్చు.. ఇలా ఏది తీసుకున్నా సరే, అదో ట్రెండింగ్ న్యూసే.
ఆ లిస్టులోనే తాజాగా బాలీవుడ్ క్రేజీ పెయిర్ దీపికా పదుకొనె రణ్‌వీర్ సింగ్ జంట చేరింది. ఈ ఇద్దరూ 2013 ‘రామ్ లీలా’ టైమ్‌లో ప్రేమలో పడ్డారు. 2018లో పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఎటువంటి అభిప్రాయ బేధాలు లేకుండా ఓ వైపు తమ వైవాహిక జీవితాన్నీ, అలాగే మరోవైపు కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా చక్కబెట్టుకుంటూ వస్తున్నారు.
తాజాగా ఈ జంట తల్లితండ్రులు కాబోతున్నారన్నదే ఇప్పుడు హాట్ ట్రెండింగ్ న్యూస్. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని కన్‌ఫామ్ చేశారు జంటగా రణ్‌వీర్ అండ్ దీపికా. తమ ఇద్దరికీ పిల్లలంటే చాలా ఇష్టమనీ, ప్రస్తుతం ఆ సంతోషాన్ని మేం ఎంజాయ్ చేస్తున్నామనీ తెలిపారు.
సెప్టెంబర్ కల్లా, జూనియర్ దీపికా లేదంటే, జూనియర్ రణ్‌వీర్ రాబోతున్నారనీ తమ పిల్లలను సినిమాటిక్ పద్ధతికి దూరంగా.. చాలా పద్ధతిగా పెంచాలని అనుకుంటున్నామనీ ఈ సందర్భంగా దీపికా రణ్‌వీర్ పేర్కొనడం విశేషం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







