900 మంది ఖైదీలకు.. 1.5 మిలియన్ దిర్హామ్‌లు విరాళం

- March 05, 2024 , by Maagulf
900 మంది ఖైదీలకు.. 1.5 మిలియన్ దిర్హామ్‌లు విరాళం

దుబాయ్: రమదాన్ పతిత్ర మాసంలో  దుబాయ్‌కి చెందిన భారతీయ వ్యాపారవేత్త, ప్యూర్ గోల్డ్ జ్యువెలర్స్ వ్యవస్థాపకుడు ఫిరోజ్ మర్చంట్ మరోసారి తన దానగుణాన్ని చాటుకున్నారు. యూఏఈ జైళ్లలో శిక్ష అనుభిస్తున్న 900 మంది ఖైదీల విడుదలకు 1 Dh1.5 మిలియన్ల మొత్తాన్ని చెల్లించనున్నారు.  కరడుగట్టిన నేరస్థులకు కాకుండా.. దురదృష్టానికి గురైనవారు, వారి నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా ఆర్థిక చెల్లింపులను చేయలేని వారికి నిధులను కేటాయించినట్లు తెలిపారు. 2008లో స్థాపించబడిన తన ఫర్‌గాటెన్ సొసైటీ ద్వారా ఖైదీలతోపాటు ఆపదలో ఉన్నవారి అప్పులను తీర్చడమే కాకుండా, వారు స్వదేశానికి వెళ్లేందుకు విమాన ఛార్జీలను కూడా అందిస్తాడు.  గత 16 సంవత్సరాలుగా 20 వేల మందికి పైగా ఖైదీల విడుదల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు.   1980లో ముంబైకి చెందిన రోసీనాను వివాహం చేసుకొన్న ఫిరోజ్ 1989లోదుబాయ్‌కి విజిట్ వీసా పొంది తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అక్కడ ప్యూర్ గోల్డ్ జ్యువెలరీని స్థాపించాడు. ప్రస్తుతం 12 దేశాలలో 150 స్టోర్‌లను ఏర్పాటు చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com