ఒమనీ డిప్యూటీ ప్రిమయర్తో ప్రైమ్ మినిస్టర్ చర్చలు
- June 03, 2016
ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మిన్స్టిర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని, ఒమన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎఫైర్స్ సయ్యద్ ఫహద్ బిన్ మొహమ్మద్ అల్ సైద్‌తో ఒమన్‌లోని ప్రీమియర్‌షిప్ హెడ్ క్వార్టర్స్‌లో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాల్ని మరింత మెరుగు పరిచే దిశగా ఈ చర్చలు జరిగాయి. ఎకానమీ, ఇన్వెస్ట్మెంట్ విభాగాలకు సంబంధించి పరస్పర సహాయ సహకారాలపైనా ఇరువురూ చర్చించుకున్నారు. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా చర్చించారు. ఈ సందర్భంగా ఖతార్ మరియు ఒమన్ పలు ఒప్పందాలపై సంతకం చేశారు. అలాగే ఎంఓయూలపైనా ఒప్పందాలు కుదిరాయి. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కూమ్యూనికేషన్స్ మరియు క్యుపిఎంసి విలాయత్‌లో పియర్ కన్స్ట్రక్షన్కి సంబంధించి రాక్స్‌ని ఎక్స్పోర్ట్ చేసే విషయమై ఒప్పందం కుదర్చుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి సంబంధించిన ఒప్పందాలూ ఇందులో ముఖ్యమైనవి.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









