జాన్వీ కపూర్ బర్త్‌డే గిఫ్ట్.! పోలా.! అదిరిపోలా.!
- March 06, 2024బాలీవుడ్ బ్యూటీ.. అతిలోక సుందరిగా తెలుగు వాళ్లు అమితంగా అభిమానించే శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్.. తెలుగులో సినిమాలు చేయకుండానే అపారమైన అభిమానం సంపాదించుకుంది.
ఆమె నటించిన బాలీవుడ్ చిత్రాల తెలుగు వెర్షన్‌తోనే తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఇక, ఇప్పుడు ‘దేవర’ సినిమాతో డైరెక్ట్‌గా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.
ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘దేవర’ లుక్ మెస్మరైజ్ చేసేలా వుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పల్లెటూరి అమ్మాయి ‘తంగం’ పాత్రలో నటిస్తోందని తెలుసు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ గతంలోనే రిలీజ్ చేశారు.
బర్త్‌డే సందర్భంగా మరో లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో జాన్వీ పాప అందాలు మరింత కవ్విస్తున్నాయ్. పద్దతైన చీరకట్టు, నుదుటిన బొట్టు.. సాంప్రదాయ లుక్స్‌తో అసలు సిసలు తెలుగు ఆడపడుచులా కనిపిస్తూ.. సినిమా రిలీజ్‌కి ముందే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.
ఇది కదా తెలుగోళ్ల సత్తా.! అనేలా వుందీ ఈ తాజా పోస్టర్లో జాన్వీ లుక్. అన్నట్లు ఈ సినిమాతో పాటూ, జాన్వీ కపూర్, రామ్ చరణ్ సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే, ‘దేవర’ను ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు