మెగాస్టార్‌తో వశిష్ట ఇప్పుడప్పుడే వదిలేది లేదంటున్నాడు.!
- March 07, 2024ఇప్పుడొస్తున్న సినిమాలన్నీ పార్టులు పార్టులుగా రిలీజ్ చేసేందుకే ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట ఒకే సినిమాగా రిలీజ్ చేయాలనుకున్న సినిమాలు సైతం చివరికి వచ్చేసరికి రెండు, వీలైతే మూడు పార్టులు అని అనౌన్స్ చేస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకీ ఇదే టాక్ వినిపిస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
మూడు కాలాల నేపథ్యంలో కథ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కథా, కథనాలకు లాంగ్ లెంగ్త్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ యాంగిల్లోనే ‘విశ్వంభర’ విషయంలో ఈ సరికొత్త ప్రచారం తెర పైకి వచ్చింది.
అయితే, అటు డైరెక్టర్ వశిష్ట కానీ, ఇటు మెగాస్టార్ చిరంజీవి కానీ ఈ ప్రచారంపై ఇంతవరకూ స్పందించలేదు. ఒకవేళ అదే జరిగితే, మెగా ఫ్యాన్స్‌కి పండగే. అలాగే, వశిష్ట కూడా ఇప్పుడప్పుడే మెగాస్టార్ చిరంజీవిని వదిలి పట్టే అవకాశమే వుండదు. అసలింతకీ ఇందులో నిజమెంతో తెలీయాల్సి వుంది.
త్రిష ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన సెట్లో ‘విశ్వంభర’ షూటింగ్ జరుగుతోంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు