రోజుకో ప్రచారం ఏంటిది కల్కీ.!
- March 07, 2024
ప్రబాస్ నటించిన ‘కల్కి’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకో రూమర్ ఈ సినిమాపై సర్క్యులేట్ అవుతోంది.
మే 9న ఎలాగైనా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగ అశ్విన్ అండ్ కో కిందా మీదీ పడుతున్నారు. కానీ, అది సాధ్యమేనా.? అనే అనుమానం చుట్టూనే ఈ తరహా గాసిప్స్ క్రియేట్ అవుతున్నాయనుకోవాలేమో.
ఎందుకంటే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా ఇది. భారీ విజువల్ ఎఫెక్ట్స్.. ప్యాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతోంది. భారీ తారాగణం. ఇలా ఎటు చూసుకున్నా.. ఈ సినిమాకి భారీ నుంచి అతి భారీ తనం వుంది.
అలాంటి సినిమాలు అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేయడం కష్టమే కదా. కానీ, చాలా కమిటెడ్‌గా టీమ్ వర్క్ జరుగుతోందనీ, ఎలాగైనా అనుకున్న టైమ్‌కి ఈ సినిమాని రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అటు నిర్మాత అశ్వనీ దత్, ఇటు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
ప్రస్తుతం ఇటలీలో షెడ్యూల్ పూర్తి చేసుకుని ‘కల్కి’ టీమ్ తిరుగు పయనం కట్టింది. ఇక, మిగిలింది పెండింగ్ సీజీ వర్క్ మాత్రమే. సో, అది అనుకున్నది అనుకున్నట్లుగా కంప్లీట్ అయితే, జరుగుతున్న బూటకపు ప్రచారాలన్నింటికీ తాళం పడినట్లే. ఏం చేస్తారో ‘కల్కి’ టీమ్ చూడాలిక.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







