మెగాస్టార్‌తో వశిష్ట ఇప్పుడప్పుడే వదిలేది లేదంటున్నాడు.!
- March 07, 2024
ఇప్పుడొస్తున్న సినిమాలన్నీ పార్టులు పార్టులుగా రిలీజ్ చేసేందుకే ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట ఒకే సినిమాగా రిలీజ్ చేయాలనుకున్న సినిమాలు సైతం చివరికి వచ్చేసరికి రెండు, వీలైతే మూడు పార్టులు అని అనౌన్స్ చేస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకీ ఇదే టాక్ వినిపిస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
మూడు కాలాల నేపథ్యంలో కథ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కథా, కథనాలకు లాంగ్ లెంగ్త్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ యాంగిల్లోనే ‘విశ్వంభర’ విషయంలో ఈ సరికొత్త ప్రచారం తెర పైకి వచ్చింది.
అయితే, అటు డైరెక్టర్ వశిష్ట కానీ, ఇటు మెగాస్టార్ చిరంజీవి కానీ ఈ ప్రచారంపై ఇంతవరకూ స్పందించలేదు. ఒకవేళ అదే జరిగితే, మెగా ఫ్యాన్స్‌కి పండగే. అలాగే, వశిష్ట కూడా ఇప్పుడప్పుడే మెగాస్టార్ చిరంజీవిని వదిలి పట్టే అవకాశమే వుండదు. అసలింతకీ ఇందులో నిజమెంతో తెలీయాల్సి వుంది.
త్రిష ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన సెట్లో ‘విశ్వంభర’ షూటింగ్ జరుగుతోంది.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







