రోజుకో ప్రచారం ఏంటిది కల్కీ.!
- March 07, 2024ప్రబాస్ నటించిన ‘కల్కి’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకో రూమర్ ఈ సినిమాపై సర్క్యులేట్ అవుతోంది.
మే 9న ఎలాగైనా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగ అశ్విన్ అండ్ కో కిందా మీదీ పడుతున్నారు. కానీ, అది సాధ్యమేనా.? అనే అనుమానం చుట్టూనే ఈ తరహా గాసిప్స్ క్రియేట్ అవుతున్నాయనుకోవాలేమో.
ఎందుకంటే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా ఇది. భారీ విజువల్ ఎఫెక్ట్స్.. ప్యాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతోంది. భారీ తారాగణం. ఇలా ఎటు చూసుకున్నా.. ఈ సినిమాకి భారీ నుంచి అతి భారీ తనం వుంది.
అలాంటి సినిమాలు అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేయడం కష్టమే కదా. కానీ, చాలా కమిటెడ్‌గా టీమ్ వర్క్ జరుగుతోందనీ, ఎలాగైనా అనుకున్న టైమ్‌కి ఈ సినిమాని రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అటు నిర్మాత అశ్వనీ దత్, ఇటు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
ప్రస్తుతం ఇటలీలో షెడ్యూల్ పూర్తి చేసుకుని ‘కల్కి’ టీమ్ తిరుగు పయనం కట్టింది. ఇక, మిగిలింది పెండింగ్ సీజీ వర్క్ మాత్రమే. సో, అది అనుకున్నది అనుకున్నట్లుగా కంప్లీట్ అయితే, జరుగుతున్న బూటకపు ప్రచారాలన్నింటికీ తాళం పడినట్లే. ఏం చేస్తారో ‘కల్కి’ టీమ్ చూడాలిక.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ